‘త్వరలో నదీతీర గ్రామాలకు విద్యుత్ సౌకర్యం’
ABN , Publish Date - Aug 28 , 2024 | 12:41 AM
నల్లమలలోని కృష్ణానది తీర గ్రామాలైన సంగమేశ్వరం నుంచి సిద్దేశ్వరం, జానాల గూడెం, బలపాలతిప్ప గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎస్‌ఈ ఉమాపతి తెలిపారు.
కొత్తపల్లి, ఆగస్టు 27: నల్లమలలోని కృష్ణానది తీర గ్రామాలైన సంగమేశ్వరం నుంచి సిద్దేశ్వరం, జానాల గూడెం, బలపాలతిప్ప గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎస్‌ఈ ఉమాపతి తెలిపారు. మండలంలోని కృష్ణానదితీర గ్రామాలను జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షణాధికారి ఉమాపతితో పాటు ఆత్మకూరు ఆ శాఖ డీఈ జయశంకర్, ఏడీ రమేష్‌బాబు మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అందులో భాగంగా సంగమేశ్వరం నుంచి జానాల గూడెం వరకు ఏడున్నర కిలోమీటర్ల మేర 230 విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ గ్రామాల పరిధిలో నాలుగు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ సామగ్రి కొరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. రూ.70 లక్షల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా చీకట్లో మగ్గుతున్న ఈ గ్రామాలకు విద్యుత్ వెలుగులు రానున్నట్లు ఎస్‌ఈ ఉమాపతి వెల్లడించారు. వీరి వెంట విద్యుత్ సిబ్బంది ఉన్నారు.