ఉద్యోగులు అంకిత భావంతో పని చేయాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:20 AM
ప్రజా పాలనకు ఎలాంటి విఘాతం లేకుండా పనిచేయడానికి ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలని న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సూచించారు.
నంద్యాల రూరల్, సెప్టెంబరు 4: ప్రజా పాలనకు ఎలాంటి విఘాతం లేకుండా పనిచేయడానికి ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలని న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సూచించారు. నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అథిగా హాజరైన మంత్రి ఫరూక్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించిన సమస్యలపై తక్షణ స్పందన ఉండాలన్నారు. ఆర్థికపరమైన కొన్ని సమస్యలను నిర్ధిష్టమైన నివేదికల ద్వారా అందజేయడంతో వాటిపై ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా కృషి చేస్తుందని చెప్పారు. నంద్యాల జిల్లా నూతనంగా ఏర్పడిందని, జిల్లా అభివృద్ధికి అవసరమైన వసతులు, వనరులు సమకూర్చడానికి కృషి చేస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. విజయవాడలో జరుగుతున్న వరదల పరిస్థితులను గమనిస్తూ రేయింబవళ్లు పర్యటిస్తూ ప్రజలకు మనోధైన్యాన్ని ఇస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు పాలనా దక్షతకు ఇది నిరద్శనమని అన్నారు. నంద్యాలలోని పలు విద్యార్థి పసతి గృహాల్లో ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజన సదుపాయాలు కల్పించడం లేదన్న విషయం కలెక్టర్ నియమించిన కమిటీ నివేదికల ద్వారా తమ దృష్టికి వచ్చిందని, వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.