Share News

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

ABN , Publish Date - Oct 18 , 2024 | 01:23 AM

సుండిపెంట గ్రామం లోని రామాలయంలో గురువారం వాల్మీకి జయంతి వేడుకలను శ్రీశైలం మండల వాల్మీకి సేవా సంఘం ప్రతినిధులు, స్థానిక వాల్మీకులు ఘనంగా నిర్వహించారు.

 ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి
వాల్మీకికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే బుడ్డా

శ్రీశైలం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): సుండిపెంట గ్రామం లోని రామాలయంలో గురువారం వాల్మీకి జయంతి వేడుకలను శ్రీశైలం మండల వాల్మీకి సేవా సంఘం ప్రతినిధులు, స్థానిక వాల్మీకులు ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హాజరయ్యారు.

ఆత్మకూరు: అర్బన్‌ కాలనీలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి వారు పూలమాలలు వేసి పూజలు చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ మారూఫ్‌ ఆసియా, కమిషనర్‌ రమేష్‌బాబు, వాల్మీకి సంక్షేమ సంఘం నాయకులు ఉన్నారు.

పాణ్యం: మండలంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాణ్యంలోని తహసీల్దారు, టీడీపీ కార్యాలయాల్లో వేడుకులు నిర్వహించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, టీడీపీ, వాల్మీకి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

పగిడ్యాల: మండలంలో వాల్మీకి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వాల్మీకి పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహించారు.

జూపాడుబంగ్లా: మండలంలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. తరిగోపుల గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించే విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొనడంతో పోలీసుల బందోబస్తు మధ్య నిర్వహించారు.

మహానంది: మండలంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

మిడుతూరు: చింతలపల్లి, మిడు తూరు, పీరుసాహేబ్‌పేట, సుంకేసుల, కడుమూరు తదితర గ్రామాల్లో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. వాల్మీకులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అన్నదానం ఏర్పాటు చేశారు.

నంద్యాల రూరల్‌: మండలంలోన వాల్మీకి జయంతి వేడుకుల నిర్వహించారు. అధికారులు, టీడీపీ, వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.

బండిఆత్మకూరు: ఎర్రగుంట్లతో పాటు మండలంలోని గ్రామాల్లో వాల్మీకి జయంతిని నిర్వహించారు. అధికారులు, టీడీపీ, వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.

వెలుగోడు: మండలంలో వాల్మీకి జయంతిని నిర్వహించారు. మోత్కూరు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు.

గడివేముల: గడివేముల, గడిగరేవుల గ్రామాలతో పాటు అన్ని గ్రామాల్లో వాల్మీకి జయంతిని నిర్వహించారు. అధికారులు, టీడీపీ, వాల్మీకి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

కొత్తపల్లి: మండలంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 01:23 AM