ఘనంగా ప్రపంచ నేల దినోత్సవం
ABN , Publish Date - Dec 06 , 2024 | 01:10 AM
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ పరిశోదన స్థాన సహాయ సంచాలకుడు జాన్సన్ అధ్యక్షతన గురువారం నేల దినోత్సవాన్ని నిర్వహించారు.
నంద్యాల రూరల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ పరిశోదన స్థాన సహాయ సంచాలకుడు జాన్సన్ అధ్యక్షతన గురువారం నేల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ నేల పరిరక్షణకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఏడీఆర్ జాన్సన్ మాట్లాడుతూ భూసార పరీక్షల ఆధారంగా నేలలలో లోపిస్తున్న పోషకాలను సమృద్ధిగా నింపేందుకు సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. అనంతరం భూసార ఆరోగ్య సూత్రాలు, క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలైన నంద్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. శాస్త్రవేత్తలు బాలాజీనాయక్, సతీష్‌కుమార్, జయలక్ష్మి, వ్యవసాయ అధికారులు, రైతులు పొల్గొన్నారు.
మహానంది: భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు నేలను పరిరక్షించు కొనేందుకు కృషి చేయాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి.జయలక్ష్మి సూచించారు. గురువారం ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించారు. శాస్త్రవేత్తలు విద్యార్థులకు నేల గురించి అవగాహన కల్పించారు. అనంతరం వక్తృత్వ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు జి.ఫరీదా, వి.శివజ్యోతి, పీవీ గీతా శిరీష, స్వరాజ్యలక్ష్మి, ఈఎస్‌వీ నారాయణరావు పాల్గొన్నారు.
నందికొట్కూరు రూరల్: మండలంలోని మల్యాల గ్రామంలో ప్రపంచ నేల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. నందికొట్కూరు ఏడీఏ విజయశేఖర్, ఏవో షేక్షావలి పాల్గొన్నారు.
మిడుతూరు: మండలంలోని చెరుకుచెర్ల గ్రామంలో ప్రపంచ నేల దినోత్సవాన్ని వ్యవసాయాధికారి పీరునాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందికొట్కూరు వ్యవసాయ సహాయ సంచాలకుడు విజయశేఖర్ హాజరయ్యారు. కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
వెలుగోడు: వెలుగోడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నేల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు నేల, ఆరోగ్యంపై వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఏడీఏ ఆంజనేయ, ఏవో పవన్‌కుమార్, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజరు నరంద్ర, యాగంటిపల్లి కేవీకే శాస్త్రవేత్త భార్గవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.