Share News

రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి: మంత్రి బీసీ

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:38 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి: మంత్రి బీసీ
ఆలమూరు రహదారిని పరిశీలిస్తున్న మంత్రి బీసీ

పాణ్యం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఆలమూరు గ్రామంలోని ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిని పరిశీలించారు. నంద్యాల, బనగానపల్లెకు వెళ్లే సమయంలో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు చెప్పారు. దీంతో పాటు ప్రమాదకర మలుపు ఉండడంతో వాహనాలు కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వర్షాకాలంలో మలుపులో నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడుతుందన్నారు. దీంతో రహదారికి ఆటంకంగా ఉండే అక్రమ కట్టడాలను స్వచ్ఛందంగా కూల్చివేసి రహదారికి ఆటంకం లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. దీంతో మంత్రి ప్రజల సహకారానికి అభినందనలు తెలిపారు. త్వరలో ఈ రహదారిని మరింత అభివృద్ధిపరచి ప్రమాదాలు లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామగోవిందరెడ్డి, చంద్రశేఖర్‌, గ్రామ ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:38 AM