వరద బాధితులకు చేయూత
ABN , Publish Date - Oct 01 , 2024 | 12:14 AM
మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళా ఐక్య సంఘాల నాయకులు, పొదుపు మహిళలు విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం అందించారు.
మిడుతూరు, సెప్టెంబరు 30: మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళా ఐక్య సంఘాల నాయకులు, పొదుపు మహిళలు విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం అందించారు. గ్రామాలలో వసూలైన మొత్తం రూ.1,67860 చెక్కును ఏపీఎం సుబ్బయ్య ఆధ్వర్యంలో వెలుగు సిబ్బంది మండల సమాఖ్య కార్యాలయంలో టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డికి అందించారు. అనంతరం చెక్కు అమౌంటును జిల్లా సమైఖ్యకు బదిలీ చేసినట్లు ఏపీఎం తెలిపారు. కార్యక్రమంలో సీసీలు సయిరా బాను, స్వామన్న, కృష్ణా రెడ్డి, శంకరయ్య, మహిళా సమాఖ్య ఓబీలు, వీవోఏలు పాల్గొన్నారు.