నంద్యాల వైద్యులకు ఐఎంఏ జాతీయ పురస్కారాలు
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:52 PM
నంద్యాలకు చెందిన ప్రముఖ వైద్యులు రవికృష్ణ, మధుసూదన్‌రావు ఐఎంఏ జాతీయ పురస్కారాలను శుక్రవారం అందుకున్నారు.
నంద్యాల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నంద్యాలకు చెందిన ప్రముఖ వైద్యులు రవికృష్ణ, మధుసూదన్‌రావు ఐఎంఏ జాతీయ పురస్కారాలను శుక్రవారం అందుకున్నారు. హైదరాబాద్‌లో భారతీయ వైద్య సంఘం 99వ జాతీయ మహాసభలో పురస్కారాలను అందుకున్నట్లు డా.రవికృష్ణ తెలిపారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.రవికృష్ణ మూడు దశాబ్దాలలో సామాజికసేవలకు డా.జ్యోతిప్రసాద్ గంగూలీ స్మారక జాతీయ పురస్కారం అందుకోగా, ప్రముఖ ఈఎన్‌టీ వైద్యుడు మధుసూదన్‌రావు చేసిన వైద్య సేవలకు గుర్తింపుగా ఐఎంఏ జాతీయ జీవితకాల సాధన పురస్కారం అందుకున్నారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు అశోకన్, ప్రధాన కార్యదర్శి డా.అనిల్‌కుమార్ నాయక్, నూతన అధ్యక్షుడు డా.దిలీప్‌భన్సాలి చేతులమీదుగా పురస్కారాలను అందుకున్నట్లు చెప్పారు.