పత్తి విత్తనశుద్ధి కేంద్రాల తనిఖీ
ABN , Publish Date - Dec 21 , 2024 | 12:22 AM
పట్టణ సమీపంలోని పలు ప్రత్తి విత్తన శుద్ధి కేంద్రాలను జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నంద్యాల రూరల్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని పలు ప్రత్తి విత్తన శుద్ధి కేంద్రాలను జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవ్య సీడ్స్, బబ్బూరి ఆగ్రో ఇండస్ట్రీస్ ఆయన తనిఖీ చేసి రిజిస్టర్లు, కంపెనీ స్టాక్‌లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అనుమతి పొందిన కంపెనీల పత్తి విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేయాలన్నారు. నిల్వలను కంపెనీ వారిగా రిజిస్టర్ నిర్వహించాలన్నారు. వ్యర్థాలను ఈటీపీ విధానం ద్వారా శుద్ధి చేయాలన్నారు. శుద్ధి చేశాక ఆ నీటిని పొలాలకు వదిలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు పాల్గొన్నారు.