పశుగణన పోస్టర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Oct 26 , 2024 | 12:48 AM
పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పశుగణన పోస్టర్‌ను న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ శుక్రవారం ఆవిష్కరించారు.
నంద్యాల రూరల్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పశుగణన పోస్టర్‌ను న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పశువుల గణాంకాల సేకరణకు వచ్చే సిబ్బందికి పశుపోషకులు సహకరించాలని పిలుపు నిచ్చారు. సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరారు. కపశుసంవర్థకశాఖ డాక్టర్లు గోవింద్‌నాయక్, శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గడివేముల: పాడి రైతులు పశుగణనకు సహకరిం చాలని ఎంపీడీవో వాసుదేవగుప్తా, పశువైద్యాధికారి సాయిహరిణి సూచించారు. అఖిలభారత పశుగణన కార్యక్రమం సందర్భంగా శుక్రవారం వారు పోస్టర్‌ను ఆవిష్కరించారు.
పాములపాడు: మండలంలో పశుగణన చేపట్టినట్లు పశు వైద్యాధికారి అనిల్ తెలపారు. పాములపాడులో సర్పంచ్ భాగ్యమ్మ చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించారు. చెలిమిళ్ళ, రుద్రవరం, జూటూరు, తుమ్మలూరు, పాములపాడు గ్రామాలకు సూపర్‌వైజర్‌లను నియమించామని, ఈ కార్యక్రమం ఈ నెల 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తామని పశు వైద్యాధికారి తెలిపారు.