సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - Nov 02 , 2024 | 01:14 AM
ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం పథకం ప్రారంభించడంతో మండలంలో సంబరాలు చేసుకున్నారు.
మహానంది, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం పథకం ప్రారంభించడంతో మండలంలో సంబరాలు చేసుకున్నారు. మహానందిమండలంలోని బుక్కాపురం శ్రీనగరం, మహానంది గ్రామాలలో మహిళలుకేక్ కట్చేసి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పేద మహిళల జీవితాల్లో సీఎం చంద్ర బాబు దీపం వెలుగులు నింపారని మహి ళలు హర్షం వ్యక్తం చేశారు. యూనిట్ ఇన్చార్జి కాకర్ల శివ, మండల టీడీపీ నాయకులు శివ శంకర్, గడ్డం హరి, నాగరాజు, పొదుపు సంఘం నాయకురాలు ప్రమీల, రత్నమ్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.