‘రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు’
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:06 AM
ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్ల భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేందుకు, రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.
నంద్యాల క్రైం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్ల భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేందుకు, రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. బుధవారం నంద్యాల పట్టణంలోకి ప్రవేశించే వివిధ మార్గాల్లో ట్రాఫిక్ సీఐ బి.మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. చాపిరేవుల, వెంకటేశ్వరపురం, రైతునగరం, అయ్యలూరి మెట్ట తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాద సంకేత సూచికలతో కూడిన సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే పట్టణంలో వివిధ బ్లాక్‌స్పాట్ల వద్ద ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, వాహనాల వేగాన్ని నియంత్రించడానికి స్పీడ్ బ్రేకర్లు, ప్రమాదాల గుర్తింపు సూచికల బోర్డులు, జిగ్‌జాగ్ బారికేడింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రజలు రోడ్డుప్రమాదాల బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలలు, ముఖ్యమైన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు.