నంది వాహనంపై అమ్మవారు
ABN , Publish Date - Oct 11 , 2024 | 12:47 AM
మహానందిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం 8వ రోజు మహాగౌరి దుర్గ అలంకారంలో కామేశ్వరీదేవిని అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు.
మహానంది, అక్టోబరు 10: మహానందిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం 8వ రోజు మహాగౌరి దుర్గ అలంకారంలో కామేశ్వరీదేవిని అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. అర్చకుడు ప్రకాశంశర్మ ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. రెండో ప్రాకారంలో ఏర్పాటు చేసిన యాగశాల మంటపంలో వేదపండితుడు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో ప్రత్యేక రుత్వికులు భక్తి శ్రద్ధలతో సహస్రనామార్చన, వేదపారా యణములు, కలశ పూజలు, చండీ హోమాలతో పాటు శ్రీచక్రార్చనలు, సహాస్ర నామ కుంకుమార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. రాత్రి మహాగౌరి దుర్గ అలంకారంతో ఉన్న అమ్మవారిని నంది వాహనంపై ఆశీనులుజేసి ఆలయ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించరు. ఈవో శ్రీనివాసరెడ్డి, ఏఈవో మధు, ఆలయ ఇన్‌చార్జి పర్యవేక్షకుడు శశిధర్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసులు యాదవ్, శానిటేషన్ ఇన్‌చార్జి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
కొత్తపల్లి: కొలనుభారతి సరస్వతి అమ్మవారు 8వ రోజు గురువారం దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈవో రామలింగారెడ్డి ఆదేశాల మేరకు ప్రాతఃకాల సమయంలో అమ్మవారికి ఆలయ పురోహితులు అమ్మవారికి నూతన వస్త్రాలంకరణ, పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన, సహస్ర నామార్చన, మహా మంగళ హారతులు నిర్వహించారు. సంగమేశ్వరంలోని ఎగువ ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో ఆలయ పురోహితుడు రఘురామశర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు.
బండిఆత్మకూరు: ఓంకార క్షేత్రంలో వెలసిన ఉమామహేశ్వరీ అమ్మవారు భక్తులకు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ఈవో నాగప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారిని అర్చకులు దుర్గాదేవిగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.