Share News

‘పరేడ్‌ డ్రిల్‌తో శారీరక దృఢత్వం’

ABN , Publish Date - Nov 23 , 2024 | 01:37 AM

శారీరక దృఢత్వం, మానసిక వికాసం పరేడ్‌ డ్రిల్‌తో సాధ్యమని పోలీస్‌ అధికారులు అన్నారు.

‘పరేడ్‌ డ్రిల్‌తో శారీరక దృఢత్వం’
పరేడ్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్న పోలీసులు

నంద్యాల క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): శారీరక దృఢత్వం, మానసిక వికాసం పరేడ్‌ డ్రిల్‌తో సాధ్యమని పోలీస్‌ అధికారులు అన్నారు. శుక్రవారం ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదేశాల మేరకు జిల్లా పోలీస్‌ కార్యాలయం ఎదురుగా గల మైదానంలో సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులు, సిబ్బందితో వీక్లీ పోలీస్‌ పరేడ్‌ డ్రిల్‌ నిర్వహించారు. పోలీస్‌ అధికారులు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం పోలీస్‌ డ్రిల్‌తో పాటు యోగ, ఫిజికల్‌ ట్రైనింగ్‌ తదితరాలను నిర్వహిస్తామని తెలిపారు. ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ చంద్రబాబు, నంద్యాల సబ్‌ డివిజన్‌ డీఎస్పీ పి.శ్రీనివాసరెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, సాయుధ బలగాల సిబ్బంది, సివిల్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 01:37 AM