Share News

రైతుల అవస్థలు

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:50 AM

మూడు రోజులుగా మబ్బులు కమ్ముకొవడంతో వరి రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. మండలంలోని వివిధగ్రామాల్లో వరి పంటలను నూర్పిడి చేసే పనులల్లో రైతులు నిమగ్నమయ్యారు.

రైతుల అవస్థలు
నెహ్రూనగర్‌లో వరి ధాన్యంపై పట్టలు కప్పుతున్న రైతులు

పగిడ్యాల, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మూడు రోజులుగా మబ్బులు కమ్ముకొవడంతో వరి రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. మండలంలోని వివిధగ్రామాల్లో వరి పంటలను నూర్పిడి చేసే పనులల్లో రైతులు నిమగ్నమయ్యారు. రైతులు ధాన్యాన్ని రోడ్డు, పొలాలల్లో ఆరబెట్టుకొన్నారు. అయితే తుపాన్‌ ప్రభావంతో మబ్బులు కమ్ముకోవడంతో ధాన్యంపై టార్పాలిన్‌ పట్టలు కప్పి ఉంచారు. చేతికి వచ్చిన పటంలు కోత దశలో ముసరు కమ్ముకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:50 AM