పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: పీఎంజీ
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:53 PM
తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే పాలసీలను తపాలాశాఖ ప్రవేశపెట్టిందని, పోస్టల్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు రీజనల్ పోస్టుమాస్టర్ జనరల్ ఉపేంద్ర సూచించారు.
మహానంది, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే పాలసీలను తపాలాశాఖ ప్రవేశపెట్టిందని, పోస్టల్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు రీజనల్ పోస్టుమాస్టర్ జనరల్ ఉపేంద్ర సూచించారు. మహానంది ఆలయంలో శుక్రవారం పీఎంజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వదించి స్వామి వారి మెమెంటో అందజేశారు. అనంతరం మహానంది సమీపంలోని ఈశ్వర్‌నగర్ కాలనీలోని పోస్టాఫీసును తనిఖీ చేశారు. గ్రామ సచివాలయం వద్ద పోస్టాఫీసు ఖాతాదారుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. పోస్టాఫీసులో చిన్నమొత్తాలతో నెలనెల పొదుపు చేసుకో వాలని సూచించారు. ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి పథకం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఇన్స్‌రెన్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ పోస్టల్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ ఏఎస్‌పీ సత్యనారాయణ, పార్వతి, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, ఎంవోలు నరసింహ, రామశేషిరెడ్డి, బీపీఎంలు పాల్గొన్నారు.