Share News

పేదల వైద్యానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Nov 04 , 2024 | 12:09 AM

పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నందికొట్కూరు ఇన్‌చార్చి గౌరు వెంకటరెడ్డి అన్నారు.

పేదల వైద్యానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే
చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే జయసూర్య, గౌరు వెంకటరెడ్డి

నందికొట్కూరు రూరల్‌, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నందికొట్కూరు ఇన్‌చార్చి గౌరు వెంకటరెడ్డి అన్నారు. నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో ఉషారాణికి వైద్యం కోసం సీఎం రిలీఫ్‌ పండ్‌ నుంచి రూ.7 లక్షల చెక్కు మంజూరయింది. చెక్కును ఉషారాణి కుటుంబ సభ్యులకు ఆదివారం ఎమ్మెల్యే జయసూర్య, గౌరు వెంకటరెడ్డి అందజేశారు. వారు మాట్లాడుతూ టీడీపీ హయాంలో పేదలను అన్ని రకాలుగా ఆదుకుంటామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుతున్నామని చెప్పారు. నాయకులు సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ మద్దూరు హరిసర్వోత్తమ రెడ్డి, క్లస్టర్‌ ఇన్‌చార్జి రఘురామిరెడ్డి, జయరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 12:09 AM