సమస్యల పరిష్కారానికే ప్రజా వేదిక: ఎమ్మెల్యే
ABN , Publish Date - Oct 30 , 2024 | 12:42 AM
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా వేదిక నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు.
కొత్తపల్లి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా వేదిక నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు. మంగళవారం కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జయసూర్య హాజరై మాట్లాడారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఎమ్మెల్యే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంగమేశ్వరం నుంచి జానాలగూడెం వరకు రూ.4.50 కోట్లు నిధులతో బీటీ రోడ్డు నిర్మాణం, రూ.55 లక్షలతో నూతన విద్యుత్ సౌకర్యం కోసం నిధులు మంజూరైనట్లు చెప్పారు. రూ.2.50 కోట్ల నిధులతో మండలంలోని వివిద గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఎర్రమఠం, దుద్యాల గ్రామాల్లో 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పలు సమస్యలపై సీపీఎం నాయకుడు నక్కస్వాముల ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పలుచాని మహేశ్వరరెడ్డి, నారపురెడ్డి, లింగస్వామిగౌడు, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, విజయకుమార్, సుధాకర్, లింగన్న, జహరుల్లా, రామకృష్ణారెడ్డి, నాగేశ్వరరావు యాదవ్, బుచ్చిరెడ్డి, స్వామిరెడ్డి, డా.రాము, రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు.