ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:32 AM
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
జూపాడుబంగ్లా, సెప్టెంబరు 20: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. జూపాడుబంగ్లా మండలంలోని మండ్లెం గ్రామంలో సభ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు వందరోజుల పాలనలో పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు తదితర కార్యక్రమాలు చేపట్టడంతో ప్రజలే ఇది మంచి ప్రభుత్వం అంటున్నారని అన్నారు. చేసిన పనులను, చేయాల్సిన పనులను ప్రజలవద్దకే వెళ్లి చేస్తున్నామన్నారు. మంచి పనులు చేసిన చంద్రబాబు గురించి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన అధికారులు గైర్హాజరుకావడంతో ఎంపీడీవో నూర్జహాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోహన్‌రెడ్డి, వెంకటేశ్వర్లుయాదవ్, గిరీశ్వరరెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాసులు, మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, రామోహ్మన్‌రెడ్డి, రవికుమార్ యాదవ్, పెద్దన్న, సుఽధాకర్, సర్పంచులు కృపమ్మ, బాలమద్దిలేటి, బాలయ్య, బీజేపీ నాయకుడు దామోదర్‌రెడ్డి, జనసేన నాయకులు రవికుమార్, అధికారులు పాల్గొన్నారు.
మిడుతూరు: నాగలూటి గ్రామంలో ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎంపీడీవో నాగశేషాచల రెడ్డి, టీడీపీ నాయకుడు రవీంద్ర బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ పోస్టర్లు పంపిణీ చేశారు. ఈవోఆర్డీ ఫకృద్ధీన్, ఏపీడీ బాలాజి నాయక్, ఏపీవో జయంతి, పంచాయతీ కార్యదర్శి రవీంద్ర, నాయకులు రమణారెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పగిడ్యాల: సంకిరేణిపల్లె, తూర్పు వనములపాడు గ్రామంలో ఇన్‌చార్జి ఎంపీడీవో నాగరాజు, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రత్యేకాధికారి శేషమ్మ, ఈవోఆర్డీ నాగేంద్రమయ్య, ఏపీవో మద్దిలేటి, టీడీపీ నాయకులు శ్రీను, ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శి కోట్ల వెంకట్ తదితరులు ఉన్నారు.
గడివేముల: బూజనూరు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. హౌసింగ్ ఏఈ సత్యనారాయణమూర్తి, టీడీపీ నాయకులు దిలీప్‌కుమార్‌రెడ్డి, చిన్నముని శేషిరెడ్డి, రామకృష్ణారెడ్డి, నాగశేషులు పాల్గొన్నారు.
గోస్పాడు: జూలెపల్లె, దీబగుంట్ల గ్రామాలలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో నాగఅనసూయ, ఏపీఎం రామశేఖర్‌రెడ్డి, టీడీపీ నాయకులు గోకులరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బండిఆత్మకూరు: పార్నపల్లె, ఎర్రగుంట్ల, లింగాపురం గ్రామాల్లో శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్, ఎంపీడీవో వాసుదేవ గుప్తా ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టిక్కర్లు, బ్రోచర్లు పంపిణీ చేశారు.
మహానంది: నందిపల్లిలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఉల్లి మధు, యూనిట్ ఇన్ చార్జిలు మౌళీశ్వరరెడ్డి, శ్యామల జనార్దన్‌రెడ్డి, నాయకులు మహేశ్వర రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, చెన్నయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య పాల్గొన్నారు.
వెలుగోడు: వేల్పనూరు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో అమానుల్లా, టీడీపీ నాయకులు పోతం క్రిష్ణారెడ్డి, అన్నారపు శంకర్‌రెడ్డి, అంకిరెడ్డి, శంకర్‌రెడ్డి, పరమేశ్వరరెడ్డి, అభిమానులు, సిబ్బంది పాల్గొన్నారు.