‘పనుల్లో నాణ్యత పాటించాలి’
ABN , Publish Date - Dec 05 , 2024 | 12:45 AM
ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న గోకులాలు, సీసీ రోడ్లు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని డ్వామా పీడీ జనార్దన్ సూచించారు.
గడివేముల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న గోకులాలు, సీసీ రోడ్లు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని డ్వామా పీడీ జనార్దన్ సూచించారు. మండలంలో జరుగుతున్న పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రంలో హార్టికల్చర్ కింద సాగు చేసిన మామిడి తోటను, తిరుపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఉపాధిహామీ పథక సిబ్బందితో మండల పరిషత్ కార్యాలయంలో సమావేశమయ్యారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎంపీడీవో వాసుదేవగుప్త, ఏపీవో వెంకటరమణ, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.