Share News

పనుల్లో నాణ్యత పాటించాలి: పీఆర్‌ డీఈ

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:16 AM

రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పీఆర్‌ డీఈ గంగాధర్‌ ఆదేశించారు.

పనుల్లో నాణ్యత పాటించాలి: పీఆర్‌ డీఈ
తిరుపాడులో రోడ్డు పనులను పరిశీలిస్తున్న పీఆర్‌ డీఈ గంగాధర్‌

గడివేముల, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పీఆర్‌ డీఈ గంగాధర్‌ ఆదేశించారు. మండలంలోని దుర్వేసి, తిరుపాడు, గడివేముల, సోమాపురం గ్రామాల్లో జరుగుతున్న రోడ్డు పనులను గురువారం ఆయన పరిశీలించారు. డీఈ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. రోడ్డు నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో పీఆర్‌ ఏఈ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 12:16 AM