రావణ వాహనంపై అమ్మవారు
ABN , Publish Date - Oct 12 , 2024 | 12:21 AM
మహానందిలోని కామేశ్వరీదేవి ఆలయంలో వేదపండితులు నౌడూరి నాగేశ్వశర్మ, అర్చకులు ప్రకాశంశర్మ, పుల్లూరి జనార్దన్‌శర్మ వేదమంత్రాలతో కుంకుమార్చన పూజలను జరిపారు.
మహానంది, అక్టోబరు 11: మహానందిలోని కామేశ్వరీదేవి ఆలయంలో వేదపండితులు నౌడూరి నాగేశ్వశర్మ, అర్చకులు ప్రకాశంశర్మ, పుల్లూరి జనార్దన్‌శర్మ వేదమంత్రాలతో కుంకుమార్చన పూజలను జరిపారు. అనంతరం ప్రత్యేక యాగశాల మంటపంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వేదపండితులు, రుత్వికలు ఉదయం నుంచి సహస్ర నామార్చన, వేదపారాయణ ములు, కలశ పూజలు, చండీహోమాలతో పాటు శ్రీచక్రార్చనలు, సహస్ర నామ కుంకుమార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం సహస్ర దీపాలం కరణ సేవలను అత్యంత వైభవంగా జరిపారు. సిద్ధిధాత్రి దుర్గ అలంకారంలో అమ్మవారు దర్శనిమిచ్చారు. రావణ వాహనంపై ఆశీనులుజేసి ఆలయ పురవీధుల గుండా గ్రామోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఈవో శ్రీనివాసరెడ్డి, ఏఈవో మధు, ఆలయ ఇన్‌చార్జి పర్యవేక్షకులు శశిధర్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసులు యాదవ్, శానిటేషన్ ఇన్‌చార్జి పసుపుల సుబ్బారెడ్డితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయదశిమి పురస్కరించుకొని ఆలయంలోని కామేశ్వరీదేవికి వేదపండితులు, అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలను నిర్వహిస్తారు. ఈశ్వర్ నగర్ కాలనీలో జమ్మిచెట్టుకు పూజలు నిర్వహిస్తారు.
బండిఆత్మకూరు: ఓంకార క్షేత్రంలో ఉమామహేశ్వరి అమ్మవారు శుక్రవారం మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చారు. అనంతరం భక్తులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.
ఆత్మకూరు: పట్టణంలోని కిషన్‌సింగ్‌వీధి, సిద్ధేశ్వరా లయం, అంబాభవానీ ఆలయాల వద్ద ప్రతిష్ఠించిన దుర్గాదేవీ అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో దర్శన మిచ్చారు. వద్ద అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.
నంద్యాల (కల్చరల్): నంద్యాల పట్టణంలో అమ్మవారు పలు రూపాలలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవోలు లక్ష్మీనారాయణ, భగవత్ సేవా సమాజ్ కమిటీ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాసు, జిల్లా అధ్యక్షుడు నాగమహేశ్ పాల్గొన్నారు.
పాణ్యం: దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలలో అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు కాళికా మాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కనకదుర్గా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు సంతానలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గడివేముల: మండల కేంద్రంలోని అమ్మవారిశాలలో అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
నందికొట్కూరు: వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేకంగా పంచామృతాలతో, పంచ ద్రవ్యాలతో ఆలయ అర్చకులు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించారు.
కొత్తపల్లి: దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొలనుభారతి సరస్వతి అమ్మవారు శుక్రవారం మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈవో రామలింగారెడ్డి ఆదేశాల మేరకు ప్రాతఃకాల సమయంలో అమ్మవారికి ఆలయ పురోహితులు అమ్మవారికి నూతన వస్త్రాలంకరణ, పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన, సహస్రనామర్చకణ మహా మంగళహారతులు పూజలు నిర్వహించారు. సప్తశివాలయాల్లోని ఉమామహేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాధి క్రతువులు చేశారు. సంగమేశ్వరంలోని ఎగువ ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు.
పాములపాడు: పాములపాడులోని చౌడేశ్వరీదేవి ఆల యంలో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలను పురోహి తుడు కోదండరామయ్యశర్మ నిర్వహించారు. మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.