Share News

రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి: ఆర్డీవో

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:58 PM

ప్రభుత్వ భూములకు డీపట్టాలు ఇచ్చిన రైతులకు 20ఏళ్లు పైబడిన పొలాలను రిజిస్టర్‌ చేస్తామన్న ప్రభుత్వ నిబంధన మేరకు రీసర్వే పకడ్బందీగా చేపట్టాలని ఆర్డీవో దాసు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.

రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి: ఆర్డీవో
మాట్లాడుతున్న ఆర్డీవో దాసు

జూపాడుబంగ్లా, సెప్టెంబరు 21: ప్రభుత్వ భూములకు డీపట్టాలు ఇచ్చిన రైతులకు 20ఏళ్లు పైబడిన పొలాలను రిజిస్టర్‌ చేస్తామన్న ప్రభుత్వ నిబంధన మేరకు రీసర్వే పకడ్బందీగా చేపట్టాలని ఆర్డీవో దాసు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. రీసర్వే చేస్తున్న రికార్డులను తనిఖీ చేసి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మండలంలో 2,355 ఖాతాలకు గాను 4468.1 ఎకరాలు ఉన్నాయని, మొత్తం 1600 మంది రైతులు ఉన్నారని చెప్పారు. సర్వే చేస్తున్న సమయంలో ప్రభుత్వ నిబంధనల మేరకే చేయాలని అవకతవలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ నాయక్‌, డిప్యూటీ తహసీల్దార్లు నాగన్న, చంద్రశేఖర్‌, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:58 PM