Share News

విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Nov 07 , 2024 | 12:20 AM

విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలి: ఎమ్మెల్యే
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరిత

పాణ్యం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్‌ డే కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్‌ శివారెడ్డి మాట్లాడుతూ కళాశాలకు సొంత భవనానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేను కోరారు. పాఠశాలకు ప్రహారీ నిర్మించాలని హెచ్‌ఎం మేరీ సునీత కోరారు. కళాశాలకు ప్రహారీ, సొంత భవనం ఏర్పాటుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నంద్యాల పీఎస్‌సీ అండ్‌ కెవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శశికళ, టి.చంద్రయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రామన్‌, ఎంపీటీసీలు రంగరమేష్‌, భాస్కరరెడ్డి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ రమణమూర్తి, టీడీపీ నాయకులు రామ్మోహన్‌ నాయుడు, రామగోవిందరెడ్డి పాల్గొన్నారు.

చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ. 9.08 లక్షల చెక్కులను బుధవారం బాధితులకు అందజేసినట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత తెలిపారు. ఎస్‌ అశోక్‌కుమార్‌కు రూ.25 వేలు, వెంకటరమణకు రూ. 35 వేలు, ఓంకారమయ్యకు రూ.లక్ష చెక్కును అందించారు. చాకలి పెద్దన్నకు రూ.85 వేలు, షేక్‌ సనాసుల్తానాకు రూ.30 వేలు, వీరబోయిన సుబ్బారెడ్డికి రూ. 1,11,740, షేక్‌ అబ్డుల్‌ రహీంకు రూ.32,500 చెక్కులను అందించారు. బోయ సుధాకర్‌నాయుడుకు రూ.1,30,381, గడ్డం నరసింహులుకు రూ.26,218, జుంటుపల్లి నరసింహులుకు రూ.56,843, మద్దిలేటి గొల్లదాసరికి రూ. 1,16,928 చెక్కులను అందజేసినట్లు తెలిపారు. నాయకులు రవి, సురేష్‌ పాల్గొన్నారు.

గడివేముల: దుర్వేసి గ్రామానికి చెందిన కరుణాకర్‌కు రూ.56 వేలు, నరసింహులుకు రూ.26 వేలు సీఎం సహాయ నిధి నుంచి చెక్కులను ఎమ్మెల్యే గౌరు చరిత అందించారు. టీడీపీ బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణయాదవ్‌ ఉన్నారు

Updated Date - Nov 07 , 2024 | 12:20 AM