గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Dec 06 , 2024 | 01:08 AM
మండలంలోని బీసీ గురుకుల పాఠశాల, కళాశాలను డీఈవో జనార్దనరెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
పాణ్యం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని బీసీ గురుకుల పాఠశాల, కళాశాలను డీఈవో జనార్దనరెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పదో తరగతి విదార్థినులతో మాట్లాడారు. డార్మెటరీ, నూతన కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్ హాల్, స్టోర్ రూంలను పరిశీలించారు. ఆహార సరు కుల నాణ్యతను పరిశీలించారు. శనివారం జరిగే మెగా పేరెంట్స్ సమావేశం గురించి ప్రిన్సిపాల్ ఫ్లోరమ్మతో చర్చించారు. విద్యార్థినులు తయారు చేసిన ఆహ్వాన పత్రికలను పరిశీలించి వారిని అభినందించారు. ఎంఈవోలు కోటయ్య, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.