Share News

ఉద్యోగి కుటుంబానికి చేయూత

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:18 AM

ఆత్మకూరులోని సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలో వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో అక్టోబరు 10వ తేదిన మరణించిన వెంకటనారాయణ కుటుంబానికి ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ తరుపున శనివారం ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ఉద్యోగి కుటుంబానికి చేయూత
ఆర్థిక సాయం అందజేస్తున్న ఉద్యోగులు

ఆత్మకూరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరులోని సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలో వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో అక్టోబరు 10వ తేదిన మరణించిన వెంకటనారాయణ కుటుంబానికి ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ తరుపున శనివారం ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెంగళరెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చాంద్‌బాషా, స్థానిక వ్యవసాయ విస్తరణాధికారులు కలిసి రూ.2 లక్షల సాయాన్ని వెంకటనారాయణ కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఏఈవోలు మహేష్‌, సతీష్‌, శివసాయి తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:18 AM