Share News

ఆసుపత్రి నిర్వహణ తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:31 AM

మండలంలోని మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరుపై కలెక్టరు రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసుపత్రి నిర్వహణ తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం
మద్దూరు ఆసుపత్రిలో మందులను పరిశీలిస్తున్న కలెక్టర్‌

పాణ్యం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరుపై కలెక్టరు రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ, ప్రసవాల రికార్డులను మెడికల్‌ అధికారి డాక్టర్‌ సునీతను అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్‌, ఇతర రికార్డులు పరిశీఅలించి పనితీరు సరిగా లేదని, వెంటనే పనితీరు మెరుగుపర్చు కోవాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారిని ఆదేశించారు. కాలం చెల్లిన మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫార్మసిస్టు పనితీరు సరిగా లేదని క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ఆసుపత్రి సరిసర ప్రాంతాలలో ఉన్న చెత్తను తొలగించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డాక్టర్‌ సునీత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కలెక్టరు మండల పరిషత్‌ ప్రాథ మిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య నందించాలని ఉపాధ్యాయుల ను ఆదేశించారు. ఇంటింటికి తిరిగి బడిఈడు పిల్లలను గుర్తించి నమోదు చేయించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పాఠశాల మైదానం, తరగతి గదులు, చుటు ్టపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశిం చారు. మనబడి మన భవిష్యత్తు కింద చేపట్టిన పాఠ శాల భవనాల నిర్మాణాల పనులను పరిశీలించారు. పాఠశాలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను, పాఠ్యపుస్త కాలు, మరుగు దొడ్ల నిర్వహణ, తాగునీటి వసతి తదితర మౌలి క సదుపా యాల గురించి అడిగి తెలుసు కున్నారు.

నంద్యాల రూరల్‌: ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యతగా చేపట్టాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. నంద్యాల మండలంలోని చాపిరేవుల గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు.

Updated Date - Nov 14 , 2024 | 12:31 AM