సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - Dec 26 , 2024 | 11:42 PM
సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జఫ్రుల్లా ఆదేశించారు.
పాణ్యం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జఫ్రుల్లా ఆదేశించారు. గురువారం ఆయన పాణ్యంలోని సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ల్యాబ్, పారిశుధ్యం, సెక్యూరిటీ సర్వీసెస్, ఎంసీహెచ్ సర్వీస్‌లను పరిశీలించారు. డిసెంబరు నెలలో 16 కాన్పులు నిర్వహించగా వాటిలో సాధారణ కాన్పులు తొమ్మిది, సిజేరియన్ కాన్పులు ఏడు నిర్వహించారని చెప్పారు. ఎన్టీఆర్ వీఎస్‌టీ కింద 13 చిన్నపిల్లల కేసులకు చికిత్స చేశారన్నారు. కేంద్రంలో జనరల్ సర్జన్, ఫిజీషియన్ ఖాళీలు ఉన్నాయన్నారు. ఎక్స్‌రే యంత్రానికి ప్రింటర్ రావాల్సి ఉందన్నారు. ట్యాగ్ చేసిన పీహెచ్‌సీ ఎంవోలు, ఆశాలు, ఏఎన్‌ఎంలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. 303 మందుల రకాలలో 286 రకాలు అందుబాటులో ఉన్నాయని, 73 పరీక్షలకు అందుబాటులో ఉన్న పరికరాలతో 49 పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. రోగులతో మాట్లాడి వైద్య నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ వైద్యాఽధికారి డాక్టర్ రహేలా, సిబ్బంది పాల్గొన్నారు.