Share News

‘భాష్ప వాయువు ప్రయోగించడం అమానుషం’

ABN , Publish Date - Dec 16 , 2024 | 12:09 AM

పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లో రైతాంగం పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని హర్యానా పోలీసులు మూడోసారి అడ్డుకున్నారని, వారిపై భాష్పవాయువు ప్రయోగించడం అమానుషం అని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.నరసింహులు అన్నారు.

‘భాష్ప వాయువు ప్రయోగించడం అమానుషం’
మాట్లాడుతున్న అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు

నందికొట్కూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లో రైతాంగం పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని హర్యానా పోలీసులు మూడోసారి అడ్డుకున్నారని, వారిపై భాష్పవాయువు ప్రయోగించడం అమానుషం అని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.నరసింహులు అన్నారు. శంభు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన రైతులపై భాష్ప వాయువు ప్రయోగించి జల ఫిరంగులతో రైతులను చెల్లాచెదురు చేశారని, 15 మంది రైతులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ఉధృత పరిస్థితి ఏర్పాడిందని, ఈ నెల 17వ తేదీ వరకు అంబాల పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను ప్రభుత్వం నిలిపి వేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం రైతాంగం వ్యతిరేక వైఖరి స్పష్టం అయిందని అన్నారు. రైతులు తమ గళాన్ని వినిపించడానికి ఢిల్లీ వస్తుంటే అడుగడుగునా ప్రతిబంధకాలతో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు శివ, ఎల్లనాయుడు, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2024 | 12:09 AM