నవంబరు 30లోపు పూర్తి చేయాలి: కలెక్టర్
ABN , Publish Date - Oct 24 , 2024 | 12:45 AM
జిల్లాలో 211 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, రీసర్వేపై వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి శ్రద్ధగా దిద్దుబాటు పనులను నవంబరు 30వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి తహసీల్దార్లను ఆదేశించారు.
నంద్యాల కల్చరల్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 211 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, రీసర్వేపై వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి శ్రద్ధగా దిద్దుబాటు పనులను నవంబరు 30వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ అంశాలపై బుధవారం రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ జిల్లాలో ఏడు జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, భూసేకరణ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీఎంవో కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యతగా తీసుకొని పెండింగ్‌లో ఉన్న 9 సమస్యలను పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులలో రెవెన్యూ శాఖకు సంబంధించి 630దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోగా పరిష్కరించాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో 14,280 ఎకరాలకు సంబంధించిన ప్రీహోల్డ్ భూములకు సంబంధించి స్వయం సంతకాల ప్రతులను అందజేయాలన్నారు. జేసీ విష్ణుచరణ్ 261 సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు సంబందించి ఓటర్ల జాబితా వచ్చేనెల 6వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. డీఆర్వో పద్మజ, ఆర్డీవోలు పాల్గొన్నారు.
నంద్యాలలోని మున్సిపల్ టౌన్‌హాలును ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని కలెక్టర్ రాజకుమారి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ మున్సిపల్ టౌన్‌హాలును సందర్శించారు. ఆర్డీవో మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ అధికారులు ఉన్నారు.