Share News

శిక్షణను వాయిదా వేయాలి: ఏపీటీఎఫ్‌

ABN , Publish Date - Dec 19 , 2024 | 12:03 AM

ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలను వాయిదా వేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య డీఈవో జనార్దన్‌రెడ్డిని కోరారు.

శిక్షణను వాయిదా వేయాలి: ఏపీటీఎఫ్‌
డీఈవోకు వినతిపత్రం అందిస్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

నంద్యాల, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలను వాయిదా వేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య డీఈవో జనార్దన్‌రెడ్డిని కోరారు. బుధవారం నంద్యాలలోని డీఈవో కార్యాలయంలో ఏపీటీఎఫ్‌ నాయకులు డీఈవోను కలిసి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ శిక్షణాకార్యక్రమాలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయలేకి అధికారులు తలలు పట్టుకుంటున్నారన్నారు. ఒకే నెలలో 4శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని, ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసి, లీడర్‌షిప్‌, గౌడ్స్‌ అండ్‌ స్కౌట్స్‌, జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమాలు వరుసగా ఆరు రోజులు, మూడురోజులు ఏర్పాటు చేయడంతో బోధనకు దూరం కావాల్సి వస్తుందన్నారు. చాలా మండలాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండటంతో ఒక్కో శిక్షణాకార్యక్రమానికి ముగ్గురు లేదా నలుగురు ఉపాధ్యాయులను పంపాల్సిరావడంతో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయలేకపోతున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. ఈ నెలలో ఎస్‌ఏ-1 పరీక్షలుండటంతో పేపర్‌ వ్యాల్యూయేషన్‌, సిలబస్‌ పూర్తిచేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉండటంతో శిక్షణాకార్యక్రమాలు ఆటంకంగా మారాయన్నారు. కార్యక్రమాలను వాయిదావేసి వేసవి సీజన్‌లో నిర్వహిం చాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సుందర్‌రావు, రాజ్‌కుమార్‌, దస్తగిరిబాషా, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 12:03 AM