Share News

‘మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి’

ABN , Publish Date - Nov 15 , 2024 | 01:35 AM

పొదుపు సంఘాల్లోని మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతిని సాధించాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి సూచించారు.

‘మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి’
శిరివెళ్లలో సమీక్ష నిర్వహిస్తున్న డీఆర్‌డీఏ పీడీ

శిరివెళ్ల, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పొదుపు సంఘాల్లోని మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతిని సాధించాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి సూచించారు. శిరివెళ్లలోని ఐకేపీ కార్యాలయంలో ఈసీ మెంబర్స్‌, వీవోఏలతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీవోఏలు తరచూ క్షేత్రస్థాయికి వెళ్లి సంఘాల్లోని మహిళల పొదుపు రణాలు, చెల్లింపులతో పాటు సంబంధిత రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పీడీ హెచ్చరించారు. అనంతరం ప్రాజెక్టులో అమలవుతున్న పలు కార్యక్రమాలపై సమీక్షించారు. ఐకేపీ ఏపీఎం రాజశేఖర్‌రెడ్డి, సీసీలు మహేశ్వరి, దేవానంద్‌, శేఖర్‌, అయ్యన్న, వెలుగు అరుణోదయ మండల ఐక్య సంఘం అధ్యక్షురాలు రేవతి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 01:35 AM