Share News

AP CID: మద్యం కేసులో ఏపీ సీఐడీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా లక్ష్మీనారాయణ

ABN , Publish Date - Jun 13 , 2024 | 09:38 AM

అధికారం చేపట్టగానే ఏపీలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు పూనుకుంది. మద్యం కేసులో ఏపీ సీఐడీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎం. లక్ష్మీనారాయణను నియమించింది. సీనియర్ కౌన్సిల్‌గా పోసాని వెంకటేశ్వర్లును నియమిస్తూ జీవో నంబర్ 578ను విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

AP CID: మద్యం కేసులో ఏపీ సీఐడీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా లక్ష్మీనారాయణ

అమరావతి: అధికారం చేపట్టగానే ఏపీలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు పూనుకుంది. మద్యం కేసులో ఏపీ సీఐడీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎం. లక్ష్మీనారాయణను నియమించింది. సీనియర్ కౌన్సిల్‌గా పోసాని వెంకటేశ్వర్లును నియమిస్తూ జీవో నంబర్ 578ను విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. మద్యం కుంభకోణంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వాసుదేవ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.

Updated Date - Jun 13 , 2024 | 09:38 AM