Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో వెలుగు చూస్తున్న భూవివాదాలు
ABN , Publish Date - May 06 , 2024 | 10:26 AM
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూ వివాదాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి 3 ఎకరాల 69 సెంట్లు వ్యవసాయ భూమిని ముసునూరు విజయలక్ష్మి కొనుగోలు చేశారు. డిసెంబర్‌లో 1బి రికార్డుల్లో సైతం ముసునూరు విజయలక్ష్మిగా మార్పు చేశారు. తాజాగా రీ సర్వే చేసి ఎల్ పి 1153 నంబర్‌తో అధికారులు అడంగల్ రిపోర్ట్‌ని ఇచ్చారు. రీ సర్వే చేసి ఇచ్చిన అడంగల్ రిపోర్ట్‌లో తన భార్య పేరు బదులు అమ్మిన వ్యక్తి పేరు ఉండడంతో విజయలక్ష్మి భర్త శ్రీధర్ కంగుతిన్నాడు.
అమరావతి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూ వివాదాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి 3 ఎకరాల 69 సెంట్లు వ్యవసాయ భూమిని ముసునూరు విజయలక్ష్మి కొనుగోలు చేశారు. డిసెంబర్‌లో 1బి రికార్డుల్లో సైతం ముసునూరు విజయలక్ష్మిగా మార్పు చేశారు. తాజాగా రీ సర్వే చేసి ఎల్ పి 1153 నంబర్‌తో అధికారులు అడంగల్ రిపోర్ట్‌ని ఇచ్చారు. రీ సర్వే చేసి ఇచ్చిన అడంగల్ రిపోర్ట్‌లో తన భార్య పేరు బదులు అమ్మిన వ్యక్తి పేరు ఉండడంతో విజయలక్ష్మి భర్త శ్రీధర్ కంగుతిన్నాడు. అడంగల్ రిపోర్ట్‌లో పేరు మారడంతో పాటు 3 ఎకరాల 69 సెంట్లు కు 3 ఎకరాల 9 సెంట్లు మాత్రమే ఉన్నట్టు రికార్డులో అధికారులు పేర్కొన్నారు. రికార్డులో లేని 60 సెంట్లు వివరాలతోపాటు పేరు మార్పుపై అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. వేరొకరికి ఈ భూమి అమ్మాలన్నా.. అమ్మ లేని స్థితిలో భూ యజమాని శ్రీధర్ ఉన్నట్టు తెలుస్తోంది.
Loksabha polls 2024: బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అంతే.. రఘురాంరెడ్డి ఫైర్
ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ఈ భూ యాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. అసలు ఈ చట్టం తీసుకురావాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడే న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధమైన హక్కులను తీసుకెళ్లి వేరొకరి చేతిలో పెట్టడం ఎంత వరకూ సమంజసం? రైతు భూమిపై హక్కును ప్రభుత్వం నియమించే వ్యక్తుల చేతిలో పెట్టే అవకాశాన్ని ఈ యాక్ట్ కల్పిస్తోందన్న భావనను న్యాయవాదులు సైతం వ్యక్తపరుస్తున్నారు. దీనివల్ల స్థిరాస్తులు, వివాదాస్పద భూములు, స్థలాలకు సంబంధించిన వ్యవహారాల్లో రాజకీయ జోక్యానికి ఆస్కారమిచ్చినట్టు అవుతుందని, తద్వారా అధికారంలో ఉన్న పార్టీ నేతలు చెప్పిన వారికి మేలు జరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి...
TS Lok Sabha Polls: జహీరాబాద్‌లో బీసీల బాద్‌షా ఎవరో..?
H D Revanna: కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన హెచ్‌డీ రేవణ్ణకు మరో షాక్
Read Latest Telangana News And Telugu News