MP Balasouri: ఏపీని ఆదుకొనేందుకు ప్రతి ఎంపీకి లేఖలు రాయండి
ABN , Publish Date - Sep 05 , 2024 | 06:46 PM
ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజలు సర్వస్వం కొల్పోయారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు మిగిల్చిన భారీ నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలన్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 05: ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజలు సర్వస్వం కొల్పోయారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు మిగిల్చిన భారీ నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకొనేందుకు పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షల చొప్పున రాష్ట్రానికి కేటాయించాలని ఆయన విజ్జప్తి చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌లకు లేఖలు రాసినట్లు ఎంపీ బాలశౌరి వెల్లడించారు.
Delhi Excise Policy: సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
గురువారం న్యూఢిల్లీలో ఎంపీ వల్లభనేని బాలశౌరి విలేకర్లతో మాట్లాడతూ.. 2008లో బిహార్‌లోని కోసి నదికి భారీగా వరద పోటెత్తిందన్నారు. దీంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలు నిరాశ్రయులయ్యారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభలోని మొత్తం సభ్యుల ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలు బిహార్‌లోని నాడు సంభవించిన విపత్తుకు కేటాయించాలంటూ ప్రభుత్వం లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్బంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రస్తావించారు.
Also Read: Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రతి ఒక్క ఎంపీ.. తన నిధుల నుంచి రూ. 50 లక్షలు కేటాయించాలని మొత్తం ఎంపీలకు లేఖలు రాయాలని మోదీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. ఈ మొత్తం నగదు నిరాశ్రయులైన వరద బాధితులను ఆదుకొనేందుకు దోహద పడుతుందని ఎంపీ బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Hyderabad: జూబ్లీహిల్స్‌లో పలు రెస్టారెంట్లపై దాడులు.. కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో.. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. దాంతో లక్షలాది ఎకరాల పంట నీట మునిగింది. వేలాది మంది సర్వస్వం కోల్పోయారు. దీంతో వారంతా పునరావాస కేంద్రాల్లో ప్రస్తుతం తలదాచుకొంటున్నారు.
Also Read: Vinayaka Chavithi Special 2024: ముస్లిం దేశాల్లో పూజలందుకొంటున్న ‘గణపతి’
2008లో బిహార్‌లో కోసి నదికి వరద పోటు తరహాలో ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు ఏర్పడ్డాయని ఎంపీ బాలశౌరి అభిప్రాయపడ్డారు. దీంతో మానవీయ కోణంలో ఎంపీలంతా ఆంధ్రప్రదేశ్‌ను అదుకొనేందుకు ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు.
Also Read: Ravindra Jadeja: బీజేపీలో చేరిన స్టార్ క్రికెటర్.. ఫొటో షేర్ చేసిన రివాబా
Read More National News and Latest Telugu New