Share News

Police Arrests : పవన్‌కు బెదిరింపు కాల్‌ నిందితుడి అరెస్టు

ABN , Publish Date - Dec 11 , 2024 | 05:15 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను చంపేస్తామంటూ ఆయన ఓఎస్డీ వెంకటకృష్ణకు ఫోన్‌ చేసి బెదిరించిన కేసులో నిందితుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.

 Police Arrests : పవన్‌కు బెదిరింపు కాల్‌ నిందితుడి అరెస్టు

విజయవాడ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను చంపేస్తామంటూ ఆయన ఓఎస్డీ వెంకటకృష్ణకు ఫోన్‌ చేసి బెదిరించిన కేసులో నిందితుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు హోంమంత్రి వంగలపూడి అనితకు కూడా ఫోన్‌ చేసి బెదిరించాడు. వెంకటకృష్ణ, అనిత నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరుకు చెందిన నూక మల్లికార్జునరావును విజయవాడ కృష్ణలంక పోలీసులు సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని రహస్య ప్రదేశంలో ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. మల్లికార్జునరావుకు మతిస్థితిమితం లేదని గుర్తించినట్టు సమాచారం. మద్యం మత్తులో ఉండి వెంకటకృష్ణకు ఫోన్‌ చేసినట్టు గుర్తించారు.

Updated Date - Dec 11 , 2024 | 05:15 AM