Share News

తల్లి, చెల్లిపై జగన్‌ కేసు పెడతారని.. ముందే ఊహించాం

ABN , Publish Date - Oct 25 , 2024 | 03:48 AM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై కేసు పెడతారని ముందే ఊహించామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.

తల్లి, చెల్లిపై జగన్‌ కేసు పెడతారని.. ముందే ఊహించాం

  • విజయలక్ష్మి, షర్మిలకు రక్షణ కల్పిస్తాం: అనిత

విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై కేసు పెడతారని ముందే ఊహించామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. గురువారం విశాఖ, విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. ఆస్తుల పంపకం వ్యవహారంతో తల్లి, చెల్లిపై జగన్‌కు ఎంత ప్రేమ ఉందో వెల్లడైందని చెప్పారు. రాష్ట్రంలో ‘అమ్మ, చెల్లి వద్దు’ అనే సినిమా నడుస్తోందన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయని వారు రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు ఎలా విలువిస్తారని ప్రశ్నించారు. సీఎం కుర్చీకోసం సొంత బాబాయినే హత్య చేయించారని ఆరోపించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విజయలక్ష్మికి, షర్మిలకు రక్షణ కల్పిస్తామన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 03:48 AM