Share News

Minister Nara Lokesh : సమస్యలకు శాశ్వత పరిష్కారం చూడండి

ABN , Publish Date - Dec 18 , 2024 | 05:16 AM

సమస్యల పరిష్కారం కోసం తనను కలుస్తున్న బాధితులు మళ్లీ మళ్లీ తిరగకుండా వారికి శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి నారా లోకేశ్‌..

Minister Nara Lokesh : సమస్యలకు శాశ్వత పరిష్కారం చూడండి

  • అధికారులను ఆదేశించిన మంత్రి లోకేశ్‌

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం తనను కలుస్తున్న బాధితులు మళ్లీ మళ్లీ తిరగకుండా వారికి శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. తనను కలుస్తున్న వారిలో భూ బాధితులే అధికంగా ఉంటున్నందున రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో లోకేశ్‌ 52వ రోజు ప్రజా దర్బార్‌ నిర్వహించారు. చీరాల ఓడరేవు నుంచి నకరికల్లు వరకు 167ఏ 4 లైన్ల జాతీయ రహదారిలో అంతర్భాగమైన నరసరావుపేట బైపాస్‌ రోడ్డుకు ఇచ్చిన ఆప్షన్‌-3 వల్ల ఐదు గ్రామాల రైతులు నష్టపోవాల్సి వస్తోందని, నష్టం తక్కువగా ఉండే ఆప్షన్‌-2 అమలు చేయాలని నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ఆధ్వర్యంలో రైతులు కోరారు. కొవిడ్‌ సమయంలో బిడ్డ వైద్యానికి రూ.3 లక్షలకు కుదువపెట్టిన 120 గ్రాముల బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా తన మేనమామ వేధిస్తున్నాడని జగ్గయ్యపేట నియోజకవర్గం తోటచర్లకు చెందిన జీ పద్మావతి ఫిర్యాదు చేశారు. పుట్టుకతో తీవ్ర అనారోగ్యంతో జన్మించిన తమ బిడ్డ వైద్యానికి నెలకు రూ.10 వేలు ఖర్చవుతోందని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని బద్వేలుకు చెందిన ఎల్‌ కొండమ్మ వేడుకుంది. ఏడాది క్రితం యాక్సిడెంట్‌తో కోమాలోకి పోయిన తమ బిడ్డకు రూ.18 లక్షలు ఖర్చు పెట్టినా వీల్‌ చైౖర్‌కే పరిమితమయిందని, తాను పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నానని... ఆర్థిక సాయం చేయాలని కడప జిల్లా పల్లవోలుకు చెందిన ఎం శ్రీనివాసులు కోరారు.

Updated Date - Dec 18 , 2024 | 05:16 AM