Share News

Nara Lokesh: ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్ కీలకోపన్యాసం

ABN , Publish Date - Oct 29 , 2024 | 09:25 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెటుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్.. యూఎస్‌లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా లాస్ వెగాస్‌లో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను సైతం మంత్రి నారా లోకేశ్ ఈ సదస్సులో వివరించనున్నారు.

Nara Lokesh: ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్ కీలకోపన్యాసం

అమరావతి, అక్టోబర్ 29: అమెరికాలోని లాస్ వెగాస్‌‌ నగరంలో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విశిష్ట అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూల అంశాలను ఈ సమ్మిట్‌ వేదికగా... ఈ సమ్మెట్‌కు హాజరైన పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ సోదాహరణగా వివరించనున్నారు. ఈ సమ్మిట్‌ ప్రాంగణంలో పలువురు పారిశ్రామిక వేత్తలను సైతం మంత్రి లోకేష్ కలవనున్నారు. అలాగే ఈ సమావేశానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండి రేచల్, పెప్సికో మాజీ సిఈఓ ఇంద్రానూయి, రెవేచర్ సీఈఓ అశ్విన్ భరత్, సేల్స్ ఫోర్స్ ఏఐ సిఈఓ క్లారా షియాలతో సైతం మంత్రి లోకేశ్ భేటీ కానున్నారు.

Visakhapatnam: ఇండిగో విమానాలు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు


యూఎస్‌లో నారా లోకేశ్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెటుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్.. యూఎస్‌లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా రెడ్‌మండ్‌లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయాన్ని లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని సత్య నాదెళ్లను నారా లోకేశ్ కోరారు. అలాగే అమరావతిని ఎఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా రాష్ట్రంలో ఐటి హబ్‌లకు సహకారాన్ని సైతం అందించాలని కోరారు. అందుకు సత్య నాదెళ్ల సానుకూలంగా స్పందించారు.

Also Read: CM Chandrababu: గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు


యాపిల్ కేంద్ర కార్యాలయంలో..

అనంతరం శాన్​ఫ్రాన్సిస్కోలోని యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో ఆయన సమావేశమయ్యారు. భారత్‌లో యాపిల్ కార్యకలాపాల విస్తరణకు ఏపీ ఆహ్వానిస్తుందని లోకేశ్ తెలిపారు. అందుకోసం అవసరమైన మద్దతు ప్రభుత్వ తరఫున అందిస్తామని ప్రియా బాలసుబ్రహ్మణ్యంకు నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

Also Read: జగన్ చెల్లికి అన్యాయం చేయకు..! విజయమ్మ లేఖ..

Also Read: రతన్ టాటా అలా అడుగుతారని అసలు ఊహించ లేదు

Also Read: అడిగిన దానికి సమాధానం చెప్పు.. పోలీస్ పై రఘునందన్ రావు ఫైర్

Also Read: వామ్మో.. సూర్య నమస్కారాలతో ఇన్ని లాభాలున్నాయా..?


అడోబ్ సీఈఓతో నారా లోకేశ్ భేటీ

ఆ తర్వాత శాన్​ఫ్రాన్సిస్కోలోనే అడోబ్ సీఈఓ శంతను నారాయణ్‌తో సైతం నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్​లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు ఏపీ అన్నివిధాలా అనుకూలమైన ప్రాంతమని ఆయన వివరించారు. అడోబ్ కంపెనీ ప్రస్తుతం డిజిటల్ మీడియా, క్లౌడ్-ఆధారిత సేవల్లో అగ్రగామిగా ఉందని మంత్రి నారా లోకేశ్‌కు సీఈఓ శంతను నారాయణ్ వివరించారు. లోకేశ్ ప్రతిపాదనలపై కంపెనీ సహచరులతో చర్చించి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్బంగా మంత్రి నారా లోకేశ్‌కు శంతను నారాయణ్ హామీ ఇచ్చారు.

Also Read: Deepavali 2024: దీపావళి వేళ.. జస్ట్ ఇలా చేయండి చాలు..

Also Read: Dhantrayodashi 2024: ధనత్రయోదశి రోజు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది

For AndhraPradesh News And Telugu News..

Updated Date - Oct 29 , 2024 | 09:25 PM