సొంత ఆస్తులు పెంచుకున్న జగన్
ABN , Publish Date - Nov 29 , 2024 | 04:47 AM
అధికారం అడ్డుపెట్టుకుని సొంత ఆస్తులు భారీగా పెంచుకున్న జగన్.. ప్రభుత్వ సంపద పెంచానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్
అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): అధికారం అడ్డుపెట్టుకుని సొంత ఆస్తులు భారీగా పెంచుకున్న జగన్.. ప్రభుత్వ సంపద పెంచానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని వెచ్చించి ఒక ముఖ్యమంత్రి సొంత ఆస్తులు ఎలా పెంచుకోవచ్చో జగన్ నిరూపించారని పేర్కొన్నారు. పదవి లేకుండా బతకలేకపోతున్న మాజీ ముఖ్యమంత్రి.. మీడియా సమావేశంలో ప్రజలపై అసహనం ప్రదర్శించడం విడ్డూరంగా ఉందని ‘ఎక్స్’ ద్వారా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని ధ్వంసం చేసి.. వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్న జగన్ రెడ్డి, అందుకు పూర్తి భిన్నంగా నీతులు వల్లెవేయడం విడ్డూరంగా ఉందన్నారు.