Share News

ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు: మంత్రి భరత్‌

ABN , Publish Date - Nov 25 , 2024 | 05:28 AM

రాష్ట్రంలో ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలని, రాజకీయాల్లోకి వచ్చే ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు ఇస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు.

ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు: మంత్రి భరత్‌

అనంతపురం కల్చరల్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలని, రాజకీయాల్లోకి వచ్చే ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు ఇస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర యువజన సంఘం ప్రమాణ స్వీకారోత్సవ సభకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కూడా అయిన టీజీ భరత్‌ హాజరై, ప్రసంగించారు. అనంతపురం జిల్లా పారిశ్రామికాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జిల్లాలో ఎలక్ర్టిక్‌ బస్సుల తయారీ కేంద్రం ఏర్పాటు చేసి, దాదాపు 2వేల మందికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, ఎంఎస్‌ రాజు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ, యువజన సంఘం అధ్యక్షుడు శబరి వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 05:30 AM