Share News

MLA Kolikapudi : నా తప్పుంటే ఏ శిక్షనైనా అంగీకరిస్తా..

ABN , Publish Date - Oct 01 , 2024 | 05:11 AM

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను నిరూపించాలని, అప్పటి వరకూ దీక్షలో కూర్చుంటానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు.

MLA Kolikapudi : నా తప్పుంటే ఏ శిక్షనైనా అంగీకరిస్తా..

  • ఆరోపణలు నిరూపించే వరకు దీక్ష చేస్తా: ఎమ్మెల్యే కొలికపూడి

తిరువూరు, సెప్టెంబరు 30: తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను నిరూపించాలని, అప్పటి వరకూ దీక్షలో కూర్చుంటానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తన తప్పు ఉంటే ఎటువంటి శిక్షనైనా అంగీకరిస్తానని చెప్పారు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు విలేకరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పేనని, అందుకు వారికి బహిరంగంగా క్షమాపణలు చెపుతున్నానని తెలిపారు. తన క్యాంప్‌ కార్యాలయం వద్ద ఆయన సోమవారం బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ఎవరినైతే లైగింకంగా వేధించానని ఆరోపణలు వచ్చాయో.. వాటిని నిరూపించాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు తాను దీక్షలో కూర్చుంటానని చెప్పి దీక్షలో కూర్చున్నారు. తప్పు నిరూపించలేకపోతే తనపై ఆరోపణలు చేసిన దంపతులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 01 , 2024 | 05:37 AM