Share News

Guntur : కేసు నమోదయింది.. సస్పెండ్‌ చేయండి

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:26 AM

సీఐడీ అధికారులపై కేసు నమోదైనందున వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి వచ్చారు.

Guntur : కేసు నమోదయింది.. సస్పెండ్‌ చేయండి

నా హత్యకు నేరపూరిత కుట్ర జరిగింది

ఆధారాలు ఇవిగో... విచారణ త్వరగా

పూర్తి చేయండి: రఘురామరాజు

గుంటూరు, జూలై 18: సీఐడీ అధికారులపై కేసు నమోదైనందున వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ సతీశ్‌ కుమార్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో నన్ను హత్యచేసి గుండెపోటుగా చిత్రీకరించాలనే కుట్ర జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 13న గుంటూరు, నగరంపాలెం పోలీస్‌ ేస్టషన్‌లో హత్యాయత్నం, కుట్ర కేసు నమోదయ్యాయి.

సీఐడీ చీఫ్‌, అదనపు డీజీ పీవీ సునీల్‌ కుమార్‌, ఇంటెలిజెన్స్‌ డీజీపీ సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, సీఐడీ అదనపు ఎస్పీ కే విజయపాల్‌, నాటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ జి.ప్రభావతి తదితరులను నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. నా వద్ద ఉన్న ఆధారాలను ఎస్పీకి అందజేసి, కేసు దర్యాప్తు పురోగతి తెలుసుకునేందుకే వచ్చా. నాటి కుట్రలో అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ పాత్ర కూడా ఉంది. ఆనాటి జీజీహెచ్‌ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీకాంత్‌ను అందుబాటులో ఉండాలంటూ కలెక్టర్‌ ఎందుకు లేఖ రాశారో తేలాలి.

నన్ను హత్య చేేసందుకు నేరపూరిత కూట్ర జరిగిందనడానికి ఆధారాలను ఎస్పీకి అందించా. ఈ కేసులో త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులను శిక్షించాలని కోరాను. ఈ కేసులో నలుగురు అధికారులు ఉంటే వారిని ఎందుకు సస్పెండ్‌ చేయలేదో నాకు అర్థం కావడం లేదు’ అని ఎమ్మెల్యే అన్నారు. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత సస్పెండ్‌ చేయవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన పాత్రధారి అయిన అదనపు ఎస్పీ కే విజయ్‌ పాల్‌ పరారీలో ఉన్నారన్నారు. ఆయనను అరెస్టు చేసి విచారిస్తే కుట్ర కోణం బయటపడుతుందన్నారు.

Updated Date - Jul 19 , 2024 | 04:26 AM