Vijayawada: లయోలా కాలేజీ యాజమాన్యంపై మార్నింగ్ వాకర్స్ ఫైర్
ABN , Publish Date - Dec 21 , 2024 | 11:11 AM
లయోలా కాలేజీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిపై మార్నింగ్ వాకర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వారి చేపట్టిన నిరసన శనివారం మూడో రోజుకు చేరుకొంది.
విజయవాడ, డిసెంబర్ 21: నగరంలో మార్నింగ్ వాకర్స్ చేపట్టిన ఆందోళనలు మూడో రోజుకు చేరాయి. ఉదయం వాకింగ్‌కు కళాశాల యాజమాన్యం అనుమతి ఇవ్వకపోవడంపై ఆంధ్ర లయోలా కళాశాల వద్ద మార్నింగ్ వాకర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు చేపట్టిన ఆందోళనలు శనివారం మూడో రోజుకు చేరాయి. గురువారం నుంచి వారు లయోలా కళశాల వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు. తాము శాంతియుతంగా చేస్తున్న ఈ పోరాటంపై.. అలాగే తమ న్యాయమైన కోరికపై కళాశాల యాజమాన్యం ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సైతం స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
Also Read: భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి
అయినా ఈ కాలేజీ యాజమాన్యం ఎందుకు ఇంతలా వ్యవహరిస్తోందో తమకు అర్థం కావడం లేదన్నారు. మార్నింగ్ వాక్ చేసేందుకు తమకు సొంత ప్రదేశం లేదని తెలిపారు. ప్రజల కోసమే.. వారి ఆరోగ్యం కోసమే తాము డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా నిరసనకు దిగిన వారు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో గతంలో పాలకులు తమకు ఇచ్చిన స్పష్టమైన హామీని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
Also Read: భవానీ దీక్ష విరమణలు.. సీపీ కీలక వ్యాఖ్యలు
ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, కమిషనర్, ఎంపీతోపాటు ఎమ్మెల్యేను సైతం కలిశామని వివరించారు. అయితే గత మూడు దశాబ్దాలుగా ఇదే లయోలా కాలేజీలో మార్నింగ్ వాక్ నడుస్తున్నారన్నారు. ఇక్కడ వరల్డ్ క్లాస్ వాకర్స్ సైతం ఉన్నారని చెప్పారు. దీంతో మనకు పేరు సైతం వస్తుందని పేర్కొన్నారు. తాము చేపట్టిన ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు స్పష్టం చేశారు. తమ న్యాయమైన కోర్కెల డిమాండ్ ను తీర్చాలన్నారు.
అయితే ఈ అంశంపై లయోలా కళాశాల యాజమాన్యం ఇంత వరకు స్పందించలేదని గుర్తు చేశారు. యాజమాన్యం స్పందించి.. వాకర్స్‌ను కలిసింది కానీ.. ప్రకటన చేయడం కానీ చేయలేదన్నారు. తాము ఈ కారణంతో అనుమతి ఇవ్వలేమని కానీ.. ఈ కండిషన్లతో అనుమతి ఇస్తామని కానీ వారు చెప్పడం లేదని వివరించారు.
తాము మాత్రం శాంతి యుతంగా పోరాట చేస్తున్నామని.. కానీ వారు మాత్రం దేవతల్లా.. లోపలే ఉంటున్నారన్నారు. అయితే ఈ ఆందోళనలో దాదాపు 200 మంది పాల్గొన్నామని.. తాము చేస్తున్న ఆందోళన మరికొద్ది రోజుల్లో ఉగ్రరూపం దాలుస్తుందని నిరసన కారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అయితే తాము శాంతి యుతంగా పోరాటం చేస్తామని ప్రభుత్వంలోని పెద్దలకు ఇప్పటికే హామీ ఇచ్చామని వారు గుర్తు చేశారు. లేకుంటే కళాశాల గేట్లు గతంలోనే తెరిచే వారమని చెప్పారు.
గతంలో కళాశాలలోకి వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. అయితే ప్రభుత్వంలోని పెద్దలు ఈ సమస్యను పరిష్కరిస్తామని.. అందులోభాగంగా శాంతి యుతంగా ఉండాలని తమను వారు సూచించారని గుర్తు చేశారు. దేశంలో కానీ, మరే రాష్ట్రంలో కానీ మార్నింగ్ వాక్ చేస్తాం.. అనుమతి ఇవ్వడంటూ కోరే అవకాశమే లేదన్నారు. కానీ ఇక్కడ మాత్రం తమ దౌర్భాగ్యమని మార్నింగ్ వాక్ నిరసనకారులు స్పష్టం చేశారు.
లయోలా కళాశాల యాజమాన్యం.. సమాజంలో ఒక భాగమన్నారు. అలాంటి కళాశాల యాజమాన్యం.. సమాజానికి దూరంగా వెళ్తుందని మండిపడ్డారు. ఇది వ్యవస్థకు మంచిది కాదంటూ లయోలా కళాశాల యాజమాన్యానికి హితవు పలికింది. గత 75 ఏళ్లు నుంచి లయోలా కాలేజీ అంటే అందరికీ అమితమైన గౌరవం ఉందని గుర్తు చేశారు. అలాంటి కాలేజీ నేడు ఈ విధంగా వ్యవహరించడం పట్ల మార్నింగ్ వాక్ వారు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎంతో మంది ప్రిన్సిపల్స్ వచ్చారు.. వెళ్లారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపల్ అనుసరిస్తున్న ఈ ధోరణి మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు. లయోలా కాలేజీ యాజమాన్యం.. వారి ఆస్తులను తాము అడగడం లేదన్నారు. తాము కేవలం మార్నింగ్ వాక్ చేసుకొనేందుకు అనుమతి మాత్రమే అడుగుతున్నామని మహిళా మార్నింగ్ వాకర్స్ సైతం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇంకోవైపు ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు.. ఈ చిన్న సమస్యనే పట్టించుకోకుంటే.. వారు మిగిలిన అంశాలు ఏం పట్టించుకొంటారని మార్నింగ్ వాకర్స్.. ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించి.. వెంటనే తమ న్యాయమైన డిమాండ్ ను నేరవేర్చాలని ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
For AndhraPradesh News And Telugu News