Nara Bhuvaneswari: చల్లపల్లి ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో భావోద్వేగానికి గురైన నారా భువనేశ్వరి
ABN , Publish Date - Jun 28 , 2024 | 08:57 PM
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. చల్లపల్లి ఎన్టీఆర్ మోడల్ స్కూలు విద్యార్థులతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పిల్లలతో భోజనం చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇక్కడ పిల్లలతో ఆమె ఆనందంగా గడిపారు.
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. చల్లపల్లి ఎన్టీఆర్ మోడల్ స్కూలు విద్యార్థులతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పిల్లలతో భోజనం చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇక్కడ పిల్లలతో ఆమె ఆనందంగా గడిపారు. పిల్లల్ని చూసేందుకు శుక్రవారం ఆమె చల్లపల్లి ఎన్టీఆర్ మోడల్ స్కూలుని సందర్శించారు.
పిల్లలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ హత్తుకున్నారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలతోనే కలిసి ఆమె భోజనం చేశారు. కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా భువనేశ్వరి 400 మందికి పైగా అనాథలు, పేద పిల్లలను చదివిపిస్తున్నారు. విద్యార్థులకు అన్నీ తానై చదివిస్తున్నారు.
కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత ఎన్నికల హడావుడి నేపథ్యంలో కొంతకాలం నారా భువనేశ్వరి బిజీబిజీగా గడిపారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలను ‘నిజం గెలవాలి’ పేట పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఇక ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ ఆమె పాల్గొన్న విషయం తెలిసిందే.