Lokesh: ఉత్తరాంధ్రాను వైసీపీ గంజాయికి కేంద్రంగా మార్చింది: నారా లోకేష్
ABN , Publish Date - Feb 20 , 2024 | 05:53 PM
ఉత్తరాంధ్రను టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) హయాంలో అభివృద్ధి బాటలో నడిపిస్తే.. వైసీపీ వచ్చిన 5 ఏళ్లలో గంజాయి సరఫరాకు కేంద్రంగా మార్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. నర్సీపట్నంలో జరిగిన టీడీపీ శంఖారావంలో ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నం టీడీపీకి కంచుకోట అన్నారు.
నర్సీపట్నం: ఉత్తరాంధ్రను టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) హయాంలో అభివృద్ధి బాటలో నడిపిస్తే.. వైసీపీ వచ్చిన 5 ఏళ్లలో గంజాయి సరఫరాకు కేంద్రంగా మార్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. నర్సీపట్నంలో జరిగిన టీడీపీ శంఖారావంలో ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నం టీడీపీకి కంచుకోట అన్నారు.
అయ్యన్నపాత్రుడిపై ఎన్నో కేసులు పెట్టారని.. అయినా ఒక్క కేసు కూడా నిరూపించలేకపోయారని తెలిపారు. "ఉత్తరాంధ్రను మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కలిసి మోసం చేస్తున్నారు. సీఎం జగన్(CM Jagan) సిద్ధం సభలో మతి భ్రమించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు నవ రత్నాలు ఇస్తామని చెప్పి.. బూతు పనులు చేసే వారికి రత్నాలు ఇస్తున్నారు. దక్షిణ భారత దేశంలో ఏపీలోనే డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ తరగతుల్ని తీసుకొచ్చిన ఘనత తెలుగు దేశానిదే. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుంది. అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తాం. చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాం. జగన్ రెడ్డి పెట్టే అక్రమ కేసులకు భయపడేవాళ్లం కాదు" అని లోకేష్ స్పష్టం చేశారు.