Share News

Anakapalli: ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్.. రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారన్న లోకేష్

ABN , Publish Date - Feb 20 , 2024 | 08:00 PM

మూడు రాజధానుల పేరుతో జగన్(CM Jagan) మూడు ముక్కలాట ఆడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఉత్తరాంధ్రకు జగన్ శనిలా మారారని అన్నారు. లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్ర మంగళవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కొనసాగింది.

Anakapalli: ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్..  రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారన్న లోకేష్

పాయకరావుపేట: మూడు రాజధానుల పేరుతో జగన్(CM Jagan) మూడు ముక్కలాట ఆడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఉత్తరాంధ్రకు జగన్ శనిలా మారారని అన్నారు. లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్ర మంగళవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కొనసాగింది.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. "పాయకరావుపేట టీడీపీకి కంచుకోట. ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలో జరిగింది. సీఎం జగన్ బూతులు తిట్టే వారికే ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు. గంట సేపు కూడా జగన్ ఏ శాఖపై సమీక్ష చేయలేరు. టీడీపీ హయాంలో కట్టిన భవనాలకు వైసీపీ రంగులేశారు. జగన్ లక్షల కోట్ల రూపాయలున్న పేదవాడు. రుషికొండలో రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టుకున్నారు. ఆయన పరదాల్లో ఉంటే మేం ప్రజల్లో ఉంటున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సూపర్ సిక్స్ హామీలు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తాం. జగన్ హయాంలో ఏపీకి ఒక్క పరిశ్రమా రాలేదు. ఒక్కరికీ ఉద్యోగం దక్కలేదు. పాయకరావుపేటలో టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి. నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధిపథంలో నడిపించే బాధ్యత తీసుకుంటాం. స్థానిక ఎమ్మెల్యే బాబురావు ఓడిపోతారని తెలిసే వైసీపీ ఆయనకు టికెట్టు ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడుతున్న వారి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే వారిపై జ్యూడిషియల్ విచారణ జరిపి శిక్షలు పడేలా చేస్తాం. ప్రజల కోసం పోరాడుతున్న చంద్రబాబుని అక్రమంగా జైల్లో ఉంచారు. మీరు సిద్ధం అంటున్నారు. మేమూ యుద్ధానికి సిద్ధం అంటున్నాం" అని లోకేష్ స్పష్టం చేశారు.


వైసీపీ గుండెల్లో రైళ్లు..

ఉత్తరాంధ్రాలో శంఖారావం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగలపూడి అనిత మాట్లాడుతూ.. లోకేష్ శంఖారావం చూసి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. దుర్మార్గుడి పాలనలో రాష్ట్రం అట్టుడుకుతోందన్నారు. పింఛన్ రూ.వెయ్యి పెంచడానికి జగన్‌కి 5 ఏళ్లు పట్టిందని అన్నారు.

టీడీపీ హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. అక్కడ టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుని లోకేష్‌కు కానుకగా ఇస్తామన్నారు. అనకాపల్లి జిల్లాలో ఇవాళ ఒక్క రోజే మూడు చోట్ల శంఖారావం సభల్లో పాల్గొన్నారు నారా లోకేష్. ఇవాళ్టితో ఉత్తరాంధ్రలో లోకేష్ శంఖారావం కార్యక్రమం ముగిసిందని టీడీపీ శ్రేణులు తెలిపాయి.

Updated Date - Feb 20 , 2024 | 08:00 PM