Share News

Navy : తీరంపై హేల్‌ డ్రోన్ల నిఘా

ABN , Publish Date - Dec 03 , 2024 | 05:32 AM

సము ద్ర తీర ప్రాంతాల్లో నిఘా కోసం త్వరలోనే హై ఆల్టిట్యూడ్‌ లాంగ్‌ ఎండ్యూరెన్స్‌(హేల్‌) మానవ రహిత ఎయిర్‌క్రా్‌ఫ్టలు అందుబాటులోకి రానున్నాయని తూ ర్పు నౌకాదళం చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంధార్కర్‌ వెల్లడించారు.

Navy : తీరంపై హేల్‌ డ్రోన్ల నిఘా

  • 18న సర్వే నౌక నిర్దేశక్‌ జలప్రవేశం

  • 4న ఒడిశాలోని పూరీలో నేవీ దినోత్సవం

  • ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు

  • చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంధార్కర్‌

విశాఖపట్నం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): సము ద్ర తీర ప్రాంతాల్లో నిఘా కోసం త్వరలోనే హై ఆల్టిట్యూడ్‌ లాంగ్‌ ఎండ్యూరెన్స్‌(హేల్‌) మానవ రహిత ఎయిర్‌క్రా్‌ఫ్టలు అందుబాటులోకి రానున్నాయని తూ ర్పు నౌకాదళం చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంధార్కర్‌ వెల్లడించారు. అత్యంత ఎత్తులో ఎగురుతూ ఎక్కువ సమయం నిఘా పెట్టగల ఈ డ్రోన్లను రిమోట్‌తో ఆపరేట్‌ చేయవచ్చ న్నారు. నేవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన మాట్లాడుతూ... ప్రాంత రక్షణను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే నేవీ నౌకల్లో మానవరహిత ఏరియల్‌ వెహికల్స్‌(యుఏవీ )ను ఉపయోగిస్తున్నామన్నారు. అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం హేల్‌ ఎంక్యు-9బి సీ గార్డియన్స్‌ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. సర్వే నౌక ‘నిర్దేశక్‌’ ఈ నెల 18న జలప్రవేశం చేయనుందని చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకల రాకపోకలు, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పెంధార్కర్‌ చెప్పారు. ఈ నెల 4న నేవీ దినోత్సవాన్ని ఒడిశాలోని పూరీలో నిర్వహిస్తున్నామని, దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు. విశాఖపట్నం ప్రజల కోసం సాహస విన్యాసాల ప్రదర్శనను జనవరి 4న నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారని చెప్పారు.

Updated Date - Dec 03 , 2024 | 05:33 AM