Share News

AP Politics: సీఈఓ మీనాను కలిసిన ఎన్డీఏ కూటమి నేతలు.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:07 PM

కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) బేఖాతరు చేస్తోంది. నిన్న(ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ‘ప్రజాగళం’ సభలో ఏపీ పోలీసులు సరైన భద్రత చర్యలు తీసుకోలేదని ఏపీ సీఈఓ ఎంకే ముకేష్ కుమార్‌ మీనా (Mukesh Kumar Meena)కు ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ సీఈఓను టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య, జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, బాజీ నేతృత్వంలోని ఎన్డీఏ బృందం సభ్యులు కలిశారు.

AP Politics: సీఈఓ మీనాను కలిసిన ఎన్డీఏ కూటమి నేతలు.. కారణమిదే..?

అమరావతి: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) బేఖాతరు చేస్తోంది. నిన్న(ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ‘ప్రజాగళం’ సభలో ఏపీ పోలీసులు సరైన భద్రత చర్యలు తీసుకోలేదని ఏపీ సీఈఓ ఎంకే ముకేష్ కుమార్‌ మీనా (Mukesh Kumar Meena)కు ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ సీఈఓను టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య, జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, బాజీ నేతృత్వంలోని ఎన్డీఏ బృందం సభ్యులు కలిశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ‘ప్రజాగళం’ సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రతకు సంబంధించిన అంశాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దేశ ప్రధానమంత్రి హాజరయ్యే సభకు బ్లాంక్ పాస్‌లు ఇచ్చారని, ఎవరికి జారీ చేస్తున్నారో కనీసం వాళ్ల పేర్లు లేకుండా పాస్‌లు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డి వ్యవహర శైలిపై సీఈఓ మీనాకు ఫిర్యాదు చేసిన తర్వాత టీడీపీ, బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు.

AP Politics: ప్రధాని సభపై కుట్ర.. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న జనసేన..?

AP Politics: ‘ప్రజాగళం’ సభలో పోలీసుల సహాయ నిరాకరణపై కూటమి సీరియస్

ప్రధాని మోదీ సభలో పోలీసుల నిర్లక్ష్యం: వర్ల రామయ్య

నిన్న(ఆదివారం) ‘ప్రజాగళం’ సభలో పోలీసుల వ్యవహర శైలిపై సీఈవో ఎంకే ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశామని తెలుగుదేశం పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే సభలో సౌండ్ సిస్టంలపై జనాలు ఎక్కుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అది ప్రధాని సభ అనుకున్నారా దారిన పోయే దానయ్య సభ అనుకున్నారా అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నిన్నటి సభలో పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డి మిన్నకుండిపోయారని... ఆయన కంటే కానిస్టేబుల్ నయమన్నారు. నిన్నటి సభను భగ్నం చేయడానికి ఎస్పీ శాయశక్తులా ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం పడిపోతే తానూ రాజీనామా చేస్తానని డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి అంటున్నారు, అటూ ఇంటిలిజెన్స్ డీజీ, పల్నాడు ఎస్పీలు కూడా తాము వెళ్లిపోతామని చెబుతున్నారన్నారు. ఈ సభ వ్యవహారంపై ఆధారాలతో సహ సీఈఓ మీనాను కలిసి బాధ్యలైన నలుగురు అధికారులపై ఫిర్యాదు చేశామని తెలిపారు. డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, ఇంటిలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, రేంజ్ ఐజీ పాల్ రాజు, ఎస్పీ రవి శంకర్ రెడ్డిలను తొలగించాలని కోరారు. ప్రధాని మోదీ సభలో 11 నిమిషాలు కరెంటు పోవడం ఏంటని నిలదీశారు. సీఎం జగన్ హెలికాప్టర్‌లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపుతారన్నారు. పోలీసులు చేతకాని తనం వల్ల లక్షలాది మంది ప్రధాని సభలో రోడ్లపైనే ఉండిపోయారని వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు.

Lanka Dinakar: వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి

సభ పాసులపై పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డి సరిగా స్పందించలేదు: పాతూరు నాగభూషణం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) వచ్చిన మీటింగ్‌ను ఫెయిల్ చేయాలని సీఎం జగన్ రెడ్డి ప్రయత్నించారని బీజేపీ సీనియర్ నేత పాతూరు నాగభూషణం (Pathuri Nagabhushanam) అన్నారు. హెలీప్యాడ్ నుంచి రిసీవింగ్‌కు పాస్‌లు ఇవ్వాలని అడిగితే పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డి సరిగా స్పందించలేదని అన్నారు. చివరకు ఢిల్లీకి ఫోన్ చేసి పాసులను తెచ్చుకోవాల్సిన దుస్థితి తెచ్చారని మండిపడ్డారు. స్టేజి పైకి బొకేలు, శాలువాలు కూడా రానివ్వలేదని.. అది పోలీసుల పనికాదు ఎస్పీజిది అని చెప్పారు. అయినా పోలీసులు కల్పించుకుని బోకేలు, శాలువాలు తెచ్చినవి తెచ్చినట్టు డస్ట్ బిన్‌లో పడేశారని... దేవుని బొమ్మతో ఉన్న వాటిని కూడా పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎస్ జవహర్‌రెడ్డి కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలన్ని కేంద్రం దృష్టికి, ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేస్తామని పాతూరు నాగభూషణం తెలిపారు.

ఇవి కూడా చదవండి

Dhulipalla Narendra: రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది

AP Politics: తాడేపల్లి సీఎం కార్యాలయానికి వైసీపీ కీలక నేతలు.. కారణమిదే..?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 06:23 PM