Share News

AP Govt: ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా..

ABN , Publish Date - Jun 30 , 2024 | 04:49 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా(Kartikeya Mishra)ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(CS Neerabh Kumar Prasad) ఆదేశాలు జారీ చేశారు. కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

AP Govt: ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా..

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా(Kartikeya Mishra)ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(CS Neerabh Kumar Prasad) ఆదేశాలు జారీ చేశారు. కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. సీఎంవోలోకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐఏఎస్‌లు ఏవీ రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను రాష్ట్ర సర్వీస్‌కు పంపాలని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం మిశ్రాను ఏపీ క్యాడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్తికేయ మిశ్రాను ఏపీ ముఖ్యమంత్రికి అడిషనల్ సెక్రటరీగా నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి:

Ram Prasad Reddy: పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైంది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Pawan kalyan: రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయంటూ డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు..

Updated Date - Jun 30 , 2024 | 04:53 PM