YCP: డీఆర్‌డీఏ కో ఆర్డినేటర్ బరితెగింపు.. వైసీపీ నేతగా మారి..
ABN , Publish Date - Mar 07 , 2024 | 08:45 AM
నెల్లూరు: డీఆర్‌డీఏ ఏరియా కో ఆర్డినేటర్ గోపు శేషారెడ్డి బరితెగించారు. ఉద్యోగ బాధ్యతలు పక్కన పెట్టి వైసీపీ నేత అవతారం ఎత్తారు. మేకపాటి వారికి సేవ చేస్తూ ప్రతి నెలా రెండు జీతాలు తీసుకుంటున్నారు. వైసీపీ సభలకు మహిళల తరలింపులో కీలకపాత్ర పోషిస్తున్నారు.
నెల్లూరు: డీఆర్‌డీఏ (DRDA) ఏరియా కో ఆర్డినేటర్ (Co-Ordinator) గోపు శేషారెడ్డి (Gopu Sheshareddy) బరితెగించారు. ఉద్యోగ బాధ్యతలు పక్కన పెట్టి వైసీపీ (YCP) నేత అవతారం ఎత్తారు. మేకపాటి వారికి సేవ చేస్తూ ప్రతి నెలా రెండు జీతాలు తీసుకుంటున్నారు. వైసీపీ సభలకు మహిళల తరలింపులో కీలకపాత్ర పోషిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయకుంటే రుణాలు రావంటూ మహిళలను బెదిరిస్తున్నారు. బెంగుళూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో మేకపాటి (Mekapati) వారికి అనుకూలంగా రాజకీయ వేదికలపై ప్రసంగాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏబీఎన్ చేతికందాయి. శేషారెడ్డిపై చర్యలు తీసుకోవడానికి పీడీ సాంబశివారెడ్డి, కలెక్టర్ హరినారాయణన్ హడలిపోతున్నారు. అధికారుల తీరుపై ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.